YS Jagan : తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఇది కేవలం ప్రభుత్వం చేసిన తప్పు అని వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. ఒకచోటే తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు అని అన్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయారు.. స్విమ్స్‌లో 35 మంది చికిత్స పొందుతున్నారు.. మొత్తం 50 నుంచి 60 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది అని జగన్ పేర్కొన్నారు.ఇంత దారుణంగా వ్యవస్థను చంద్రబాబు నడుపుతున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయిన రోజు నుంచి తిరుపతి పరువు దిగజారిపోయింది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డు విషయంలో అబద్ధాలు చెప్పి తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చరిత్ర చంద్రబాబుదే అని వైఎస్ జగన్ అన్నారు.