Homeఫ్లాష్ ఫ్లాష్తెలంగాణాలో ప్రతిపక్షం బలంగా లేదు.. అందుకే ఫామ్ హౌజ్ నుంచి పాలన.. వైఎస్ షర్మిల సంచలన...

తెలంగాణాలో ప్రతిపక్షం బలంగా లేదు.. అందుకే ఫామ్ హౌజ్ నుంచి పాలన.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతోంది.

తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని.. అయితే తనకు రాజకీయ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదో జగన్నే అడగాలన్నారు.

తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని..ఇక్కడ కొందరు మతంపేరుతో.. ఇంకొందరు ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

పార్టీ వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తానని.. ప్రతి అమరవీరుల కుటుంబం తలుపు తడుతానని ఆమె వివరించారు.

తెలంగాణాలో ప్రతిపక్షం సమర్ధవంతంగా పనిచేయడంలేదని… అందుకే ఫామ్ హౌజ్ నుంచే పాలన సాగుతోందని విమర్శించారు.

పెద్ద పెద్ద బడా నాయకులే అవసరంలేదని… మంచి నాయకులు ఎవరు తమపార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు షర్మిల.ఇ

ఇక్కడే పుట్టాను.. పెరిగాను.. పిల్లలను కన్నాను..

తన స్థానికతపై వస్తున్న విమర్శలపైనా షర్మిల స్పష్టత ఇచ్చారు. తెలంగాణలోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే పిల్లలను కన్నాను.

సీఎం కేసీఆర్‌, బీజేపీ నేత విజయశాంతి ఎక్కడ పుట్టారు?” అని ప్రశ్నించారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని స్పష్టం చేశారు.

తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని మరోసారి షర్మిల స్పష్టం చేశారు.

కోవిడ్‌ సమయంలో ఆస్పత్రులు లక్షలు వసూలు చేశాయి. ఆస్పత్రుల దోపిడీపై సీఎం కనీసం దృష్టిపెట్టలేకపోయారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు.

లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచే పార్టీ ప్రస్థానం మొదలవుతుందని స్పష్టం చేశారు షర్మిల. హైదరాబాద్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని.. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని మరోసారి స్పష్టం చేశారు.

దివంగత మాజీ సీఎం జయలలిత ఎక్కడ పుట్టి, ఎక్కడ సీఎం అయ్యారో అందరికీ తెలుసని చెప్పారు.

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో విద్యార్ధులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ షర్మిల మాట్లాడారు.

మీ అక్కగా.. మన సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.

తెలుగు ప్రజలందరినీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారన్నారు షర్మిల. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన ఘనత YSకే దక్కుతుందన్నారు.

తెలంగాణలో ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని… అందరి నిరీక్షణ ఫలించాలంటే ఒక మంచి సమాజం రావాల్సి ఉందన్నారు షర్మిల.

Recent

- Advertisment -spot_img