కడపః “నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది. కానీ ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.”అని ఏపీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి 11వ వర్ధంతిని పురస్కరించుకోని ఎమోషనల్ ట్విట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకోని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డితో పాటూ పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఘన నివాళులు అర్పించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
వైఎస్సార్‌కు ఘన నివాళి.. సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్
RELATED ARTICLES