– ఉర్దూకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి
– ఇమామ్‌లకు రూ.15వేలు ఇవ్వాలి
– మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యిందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉర్దూకు తగిన ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వంలో ఉర్దూకు ప్రాధాన్యత తగ్గిందన్నారు. మేనిఫెస్టోలో ఆ అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రస్తావించలేదన్నారు. ఉర్దూకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఎన్నికల ప్రచారంలో పదే పదే కాంగ్రెస్ గుర్తుచేసిందని, కానీ మేనిఫెస్టోలో మాత్రం పెట్టలేదన్నారు. ఇమామ్‌లకు రూ.12వేలు కాదని.. రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో కూడా నిర్వహించాలన్నారు. పాతబస్తీ అభివృద్ధిలో సర్కార్‌కు సహకరిస్తామన్నారు.