Homeతెలంగాణవైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు..

వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు..

వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన జగదీశ్వర్ గుప్తా..

హైదరాబాద్​, ఇదే నిజం: దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు బుధవారం వైయస్సార్సీపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తడక జగదీశ్వర్ గుప్తా నిర్వహించారు. నేరెడ్​మెట్​ లోని జగదీశ్వర్ గుప్తా నివాసం వద్ద నిర్మించిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 30 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, వంటి పథకాలు ప్రజలకు మేలు చేశాయని అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ పాలన అందించారని, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో సుపరి పాలన అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మజ్జి ప్రసాద్, మజ్జి వెంకట్రావు, రౌతు అచ్యుతరావు, సుంకర రమేష్, జనార్ధనరావు, యుధిష్టర్ రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img