ఇదే నిజం, ఏపీ బ్యూరో: కోడి కత్తి కేసు విచారణను విశాఖలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు డిసెంబర్ 15కి వాయిదా వేసింది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు అతడి తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బెయిల్ పిటిషన్‌పై వారం రోజుల్లో తీర్పు వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.‘ఇలాంటి కేసుల్లో ఐదేళ్ల శిక్ష పడటం నా జీవితంలో చూడలేదు. వాంగ్మూలం ఇచ్చేందుకు సీఎం జగన్ ముందుకు రావడం లేదు. రాజకీయ కోణం వల్లే ఈ కేసు ఇన్నేళ్లు సాగుతోంది. హైకోర్టు ఇచ్చిన 8 వారాల స్టే రద్దు కోసం పిటిషన్ వేస్తాం’అని శ్రీనివాస్ తరఫు న్యాయవాది సలీం మీడియాకు వెల్లడించారు.