భారత్ మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రవిచంద్రన్ అశ్విన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అశ్విన్ కు పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆడే అర్హత లేదన్నారు. అశ్విన్ గొప్ప ప్లేయర్ కానీ.. వన్డే, టీ20 జట్టులో ఉండే అర్హత అతడికి లేదని చెప్పారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో బ్యాటర్ గా, ఫీల్డర్ గా ఏం ప్రభావం చూపగలడు? టెస్టుల్లో మాత్రం అతడు ఉండాల్సిందే. కానీ, వైట్‌బాల్ క్రికెట్ జట్టులో అతడికి చోటు అవసరం లేదని యువీ వ్యాఖ్యానించాడు. అశ్విన్, యువరాజ్ చాలాకాలంపాటు కలిసి ఆడారు. టీమ్‌ఇండియా 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన జట్టులోనూ ఉన్నారు. అశ్విన్ భారత్ తరఫున 95 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు.