ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ మహిళల గురించి చాలా దారుణంగా మాట్లాడి మరో వివాదానికి తెరతీశాడు. పెళ్లి అయినా మగాడిని ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం తప్పుకాదన్నారు. ఓ మహిళ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే బజారు మనిషిలా మిగిలిపోతుందని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జకీర్ నాయక్ మాట్లాడ్తూ.. ‘ఇస్లాం ఓ పురుషుడు ఒకటి కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహమాడేందుకు అనుమతినిస్తుంది. అంటే అప్పటికే పెళ్లయి, భార్య ఉన్న పురుషుడు మరో స్త్రీని ప్రేమించి.. పెళ్ళాడి సంతానాన్ని కూడా పొందవచ్చు అని అన్నారు. ఈ పద్దతి ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ వ్యాఖ్యానించారు. పెళ్లికాని మహిళకు సమాజంలో గౌరవం ఉండదని నాయక్ పేర్కొన్నారు. పెళ్లి చేసుకోడానికి అబ్బాయి లేకపోతే ఆ అమ్మాయికి రెండే ఆప్షన్స్ ఉన్నాయి అని… ఒకటి అవివాహితంగా ఉండడం లేదా పెళ్లయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. అయితే పెళ్లి చేసుకోకుండా ఉండడం కంటే పెళ్లయిన వ్యక్తి భార్యగా వెళ్లడమే మేలని… దీంతో ఆమె గౌరవం పెరుగుతుందని జకీర్ నాయక్ పేర్కొన్నాడు. పెళ్లికాని స్త్రీలను పబ్లిక్ ప్రాపర్టీ అని అన్నారు. రెండో పెళ్లి లేదా మూడో పెళ్లిలో పురుషుడితో కలిసి ఉంటేనే మహిళకు గౌరవం లభిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన మహిళలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారని’ జకీర్ నాయక్ అన్నారు. ఈ వ్యాఖ్యలుపై సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.