Zomato : ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (Zomato) కస్టమర్ సపోర్ట్ అసోసియేట్‌లతో సహా దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. జొమాటో తన జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (ZAAP) కింద ఒక సంవత్సరం క్రితం దాదాపు 1,500 మంది ఉద్యోగులను కస్టమర్ సపోర్ట్ పాత్రల కోసం నియమించుకుంది. అయితే పనితీరు సరిగా లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం వల్లే 500 మంది ఉద్యోగులను తొలగించిన వారిలో పలువురిని నోటీసులు లేకుండానే తొలగించినట్లు అర్థమవుతోంది. అయితే వారికి నష్టపరిహారంగా ఒక నెల జీతం చెల్లించినట్లు సమాచారం. జొమాటో కస్టమర్ సపోర్ట్ ప్రాసెస్‌లను ఆటోమేట్ చేయడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించాలని యోచిస్తోంది.