HomeతెలంగాణAssam CM : జ‌నాల‌ను క‌ల‌వ‌ని సీఎం కేసీఆర్‌

Assam CM : జ‌నాల‌ను క‌ల‌వ‌ని సీఎం కేసీఆర్‌

Assam CM : జ‌నాల‌ను క‌ల‌వ‌ని సీఎం కేసీఆర్‌

Assam CM : తాను రోజూ అనేకమంది సామాన్య ప్రజల్ని కలుస్తుంటానని.. అదే కేసీఆర్‌ అయితే ఎవరినీ దగ్గరకు రానివ్వడం లేదని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విమర్శించారు.

రాష్ట్రంలో నియంతపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

హనుమకొండలో భాజపా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల సమస్యలపై ఆదివారం నిరసన సభ నిర్వహించారు.

పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

చిన్న రాష్ట్రమైన అస్సాంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

Harish Rao : థర్డ్​వేవ్​కు సిద్ధంగా ఉండాలి

No Mask No Petrol : మాస్కులు లేకుంటే పెట్రోల్ పోయ‌రు

తమకంటే అధిక ఆదాయం పొందుతున్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విఫలమైందని విమర్శించారు.

అధికారం ఉందికదాని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు.

ఉద్యోగులు చనిపోయినా కేసీఆర్‌ మనసు కరగడం లేదు: Bandi Sanjay

ప్రభుత్వ నిర్ణయంతో దంపతులైన ఉద్యోగులు అవస్థలు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌( Bandi Sanjay ) ఆందోళన వ్యక్తం చేశారు.

జీవో 317 తెచ్చి ఉద్యోగులు, ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు.

రాష్ట్రంలో 8 మంది ఉద్యోగులు జీవో కారణంగా గుండెపోటుతో మృతి చెందినా కేసీఆర్‌ మనసు కరగడం లేదని.. భాజపా అధికారంలోకి రాగానే జీవో 317ను చెత్తపాలు చేస్తామని అన్నారు.

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Best Diet : మ‌ంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్ర‌పంచంలో మంచి డైట్‌

తెలంగాణ వద్దని చెప్పిన సీపీఎం, ఎంఐఎంలతో కేసీఆర్‌ తిరుగుతున్నారన్నారు.

కేసీఆర్‌ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి న్యాయం జరిగేంతవరకు పోరాడతామని ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు.

ఉన్న 10 జిల్లాలను 20 వరకు విభజించాల్సింది పోయి స్వార్థ రాజకీయాల కోసం 33 జిల్లాలుగా చేశారన్నారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రజావిశ్వాసం కోల్పోయారని, చివరి అస్త్రంగా పోలీసులను ప్రయోగించి లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.

2023 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.

సమావేశంలో తేజ్‌పూర్‌ ఎంపీ పల్లబ్‌ లోచన్‌దాస్‌, నలబరీ ఎమ్మెల్యే జయంత్‌ మల్ల బుర్హ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, డాక్టర్‌ విజయరామారావు, ధర్మారావు పాల్గొన్నారు.

Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

Recent

- Advertisment -spot_img