Homeబిజినెస్‌Electronics Price : ఈ ఎండాకాలం ఫ్రిజ్‌లు-ఏసీల ధరల మంట‌లు

Electronics Price : ఈ ఎండాకాలం ఫ్రిజ్‌లు-ఏసీల ధరల మంట‌లు

Electronics Price : ఈ ఎండాకాలం ఫ్రిజ్‌లు-ఏసీల ధరల మంట‌లు

ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), రిఫ్రిజరేటర్లు, వాషింగ్‌ మెషీన్ల ధరలు 5-10 శాతం మేర పెరిగే అవకాశం ఉంది.

ముడి పదార్థాల ధరలతో పాటు రవాణా ఛార్జీలు అధికం కావడంతో, ఆ భారాన్ని కొనుగోలుదార్లకు బదలాయించేందుకు కంపెనీలు సిద్ధపడుతుండటమే ఇందుకు కారణం.

ఎల్‌జీ, పానసోనిక్‌, హైయర్‌ వంటి కంపెనీలు ఇప్పటికే ధరలను కొంతమేర పెంచగా.. సోని, గోద్రేజ్‌ వంటి కంపెనీలు నిర్ణయం తీసుకునేందుకు వేచిచూస్తున్నాయి.

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

సాధారణంగా వేసవికి ముందు జనవరి-మార్చిలో ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల ధరలను కంపెనీలు 5-7 శాతం పెంచుతుంటాయని కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీమా) ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగాంజా తెలిపారు.

కంపెనీల వారీగా

ఉత్పత్తుల తయారీలో వినియోగించే లోహాలు, ఇతర ముడిపదార్థాల ధరలు అనూహ్యంగా పెరగడం, అంతర్జాతీయంగా రవాణా ఛార్జీలు భారం కావడం వల్ల ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్ల ధరలను 3-5% పెంచినట్లు హైయర్‌ అప్లయన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సతీశ్‌ ఎన్‌.ఎస్‌. తెలిపారు.

Best Diet : మ‌ంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్ర‌పంచంలో మంచి డైట్‌

Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు

ఏసీల ధరలను 8% వరకు పెంచిన పానసోనిక్‌, మళ్లీ ధరలను సవరించాలని చూస్తోంది.

ఇతర గృహోపకరణాలకూ ఇదే వర్తింప చేస్తామని పానసోనిక్‌ ఇండియా డివిజినల్‌ డైరెక్టర్‌ ఫుజిమోరి వెల్లడించారు.

వ్యాపార సుస్థిరత కోసం ధరలు పెంచక తప్పడం లేదని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ బన్సల్‌ వివరించారు.

అల్యూమినియం, రిఫ్రిజరెంట్స్‌పై యాంటీ డంపింగ్‌ సుంకాల భారం వల్ల ధరలు 2-3% పెంచాల్సి వస్తున్నట్లు హిటాచీ ఎయిర్‌ కండీషనింగ్‌ ఇండియా సీఎండీ గుర్మీత్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Walmart | వాల్‌మార్ట్ కొనుగోలు దిశ‌గా అంబానీ.. రిల‌య‌న్స్ ప‌గ్గాలు వ‌దులుకోనున్న ముకేశ్

Star Kisan Ghar : రైతులకు ఐటీ రిటర్న్స్ లేకుండానే 50లక్షల వరకు ఇంటి రుణం

Recent

- Advertisment -spot_img