Homeలైఫ్‌స్టైల్‌Bone Health : మీ ఎముక‌ల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకుంటున్నారా

Bone Health : మీ ఎముక‌ల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకుంటున్నారా

Bone Health : మీ ఎముక‌ల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకుంటున్నారా

Bone Health : శరీరంలో కీలకమైన నిర్మాణాలుగా ఎముకలను చెప్పవచ్చు.

మనిషిలో ముప్పై ఏళ్ళ వరకు ఎముకుల అభివృద్ధి వేగంగా జరుగుతుంది.

తర్వాత వాటిలో స్ధిరత్వం ఏర్పడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతుంటాయి.

సరైన పోషకాహారం తీసుకుంటూ తగిన జాగ్రత్తులు పాటిస్తే ఎముకలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.

చాలా మందిలో వయస్సు పైబడటంతో మోకాళ్ళు, కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు.

అలాంటివి రాకుండా ఉండాలంటే ముందునుండే ఎముకలకు అవసరమైన ఆహారాన్ని తీసుకోవటం మంచిది.

ఎముకలు బలహీనంగా ఉండే వారిలో ఎక్కవగా చిన్నపాటి దెబ్బతగిలినా శరీరంలోపల ఉండే ఎములకు విరిగిపోతుంటాయి.

వీటితో బీపీ, షుగ‌ర్‌ల‌కు చెక్ పెట్టొచ్చు.. మ‌రెన్నో లాభాలు

ఇలాంటి సందర్భాల్లో వారు పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.

విరిగిన ఎములకను సెట్ చేసుకునేందుకు ఆపరేషన్ అవసరపడవచ్చు.

అందుకే ఎముకల్ని బలంగా , ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఒకటి వయస్సు.

పెద్ద వయస్సు వారిలో ఎముకలు బలహీనంగా ఉంటాయి.

ఇలాంటి సందర్భాల్లో ఎముకలను బలంగా తయారు చేసుకునేందుకు తీసుకునే ఆహారంలో వివిధ రకాల పోషకాలను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రధానంగా కాల్షియం, విటమిన్ డి వంటివి ఎముకల దృఢత్వానికి ఎంతో అవసరం.

ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే..

ఎముకల్ని బలంగా ఉంచే పండ్లు, ఆకుకూరల విషయానికి వస్తే…

పచ్చి ఆకు కూరల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలు, దంతాల అభివృద్ధికి ఆకు కూరలు ఎంతగానో మేలు చేస్తాయి.

ఒక కప్పు వండిన పాలకూర శరీరానికి రోజువారీగా అవసరమయ్యే కాల్షియంలో 25శాతాన్ని అందిస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండే ఆకులలో విటమిన్ ఎ, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.

ఎములకలకు బలాన్నిచ్చే పండ్లలో నారింజ ఒకటి. నారింజ రసం శరీరానికి కాల్షియం, విటమిన్ డిని అందిస్తుంది.

నారింజ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల బోలు ఎముకల వ్యాధిని నివారించుకోవచ్చు.

చిన్నారుల్లో 17% బీపీ.. 13% శ్వాస సమస్యలు

అరటి కాయ. ఇది శరీర జీర్ణక్రియలో సహాయపడటమే కాక, మెగ్నీషియాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది.

ఎముకలు, దంతాలు నిర్మాణ అభివృద్ధిలో క్రియాశీలకం దోహదం చేస్తుంది.

రోజుకొక అరటి పండు తినటం వల్ల బలహీనమైన ఎముకలు సైతం బలంగా తయారవుతాయి.

పైనాపిల్ కూడా శరీరానికి అవసరమైన కాల్షియం అందించటం సహాయం పడుతుంది.

ఇది పోటాషియం యొక్క మూలం కావటంతో శరీరంలోని యాసిడ్ భారాన్ని తటస్ధం చేస్తుంది.

కాల్షియం లోటును పూడుస్తుంది.

స్ట్రాబెర్రీలు తినటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు సమకూరుతాయి.

ముఖ్యంగా ఎముకల బలానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇందులో కాల్షియం, మాంగనీస్, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి.

గుండె ఆరోగ్యానికి పంచ‌ సూత్రాలు

బొప్పాయి పండులో కాల్షియం లభిస్తుంది. ఈ పండును తినటం కూడా మంచిదే 100 గ్రాముల బొప్పాయిలో 20మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది.

కివి ఫ్రూట్ లో కాల్షియం అత్యధిక మొత్తంలో ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది.

Recent

- Advertisment -spot_img