Happiness is help for Healthy lifespan : ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే..
ఉరుకుల పరుగుల జీవితంలో ఆటుపోట్లను తట్టుకుని నిత్యం సంతోషంగా నిలవగలిగే వారు పూర్తి ఆరోగ్యంతో(Healthy lifespan) ఎక్కువకాలం జీవిస్తారని పలు అధ్యయనాలు స్పష్టం చేయగా తాజాగా సంతోషానికి, మన ఆరోగ్యానికి సంబంధం ఉందని హార్వర్డ్ అధ్యయనం కూడా తేల్చిచెప్పింది.
ఇక ప్రతివ్యక్తిలో సంతోషంగా ఉండటమనేది 50 శాతం జన్యుపరమైన అంశాలు నిర్ధారిస్తుండగా 40 శాతం మన చేతిలోనే ఉంటాయి.
మిగిలిన పది శాతం పరిస్ధితులపై ఆధారపడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
మన చేతిలో ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకుని సంతోషంగా మలుచుకోవడమనేది మనం చక్కదిద్దుకోవాల్సి ఉంది.
వ్యక్తిగతంగా స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులతో మెరుగైన సంబంధాలు భావోద్వేగాలను చక్కగా నియంత్రిస్తాయని ఇది ఆటోమేటిక్‌గా మనలో మూడ్ బూస్టర్‌గా ఉంటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్ర్ వాల్డింగర్ తెలిపారు.
మనలో ఉన్న బాల్యం తాలూకూ అనుభూతులను నిరంతరం అనుభవించాలని, నిత్యం సంతోషంగా ఉండే వారితో సాన్నిహిత్యంగా ఉండటం ద్వారా మనలోనూ సంతోషాన్ని నింపవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రకృతి ఒడిలో సేదతీరడం, పచ్చదనం ఉండే పరిసరాల్లో నడవడంతో పాటు రోజూ ఒకే తరహా పనిని చేయడం కంటే అదే పనిలో వైవిధ్యం కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
ఎంత బిజీగా ఉన్నా ఎంజాయ్ చేసేందుకు సమయాన్ని కేటాయించాలని, చిన్నపాటి వినోద, విహార యాత్రలూ తరచూ చేస్తుండాలని పరిశోధకులు పేర్కొన్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా పని ఒత్తిడిని మీద వేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడే ముగిస్తూ ముందుకెళ్లాలని చెబుతున్నారు.