వరంగల్ జిల్లాలో ఓ రైతు వినూత్నంగా ప్రయత్నించి అందర్నీ అబ్బురపరుస్తున్నాడు. పొలం మడిలో గుర్రాన్ని ఉపయోగించి గొర్రు కొట్టాడు. జిల్లాలోని చెన్నారావుపేట మండలం, పాపయ్యపేట గ్రామానికి చెందిన రాములు అనే రైతు ఐదేళ్ల క్రితం గుర్రం పిల్లను కొనుగోలు చేసి మచ్చిక చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: ఫ్రీగా అయోధ్యకు.. ఇలా..
అయితే తన పొలంలో గొర్రు తోలడానికి ఒకే ఎద్దు ఉండడంతో వినూత్నంగా ఆలోచించాడు. ఒకవైపు ఎద్దు, మరోవైపు గుర్రాన్ని నాగలికి కట్టి పొలంలో గొర్రు తోలి అక్కడున్న అందర్నీ అబ్బురపరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: వారికి తెలంగాణ TSRTC గుడ్ న్యూస్.. HURRY UP