Kidney Health : మీ కిడ్నీలను కాపాడుకోండి ఇలా.. లేదంటే అంతే..
Kidney Health : కిడ్నీలను కాపాడుకోవాలంటే తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యకర అలవాట్లను అలవరచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చురుకైన జీవనశైలితో పాటు మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.
డీహైడ్రేషన్‌తోనే ప్రధానంగా కిడ్నీ సమస్యలు తలెత్తుతుంటాయని, రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోవాలని నిపుణులు చెబుతారు.
మూత్రపిండాల గురించి ఈ విషయాలు తెలుసా..
అయితే కిడ్నీ వ్యాధులు ఉంటే నీరు తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
ఇంకా విటమిన్ సీ కిడ్నీలో రాళ్లను సులభంగా కరిగించేస్తుంది.
నారింజ, కుకుంబర్, బ్రకోలి వంటి సిట్రస్ పండ్లతో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
యాపిల్స్ తినడం ద్వారా మూత్రంలో అసిడిటీని మెయింటైన్ చేస్తూ కిడ్నీల్లో బ్యాక్టీరియా పెరుగుదలను నివారించవచ్చు.
కిడ్నీలు ఫెయిల్ అయ్యే ముందు వచ్చే లక్షణాలు
యాపిల్స్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఔషధాలతో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
కిడ్నీ బీన్స్‌లో ఉండే ప్రొటీన్లు, ఫైబర్లు జీర్ణ వ్యవస్ధ సాఫీగా సాగేలా చూస్తాయి.
కిడ్నీ బీన్స్‌లో ఉండే విటమిన్ బీ కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో పాటు కిడ్నీలో రాళ్లను కరిగించేస్తుంది.
నిమ్మరసంలో తేనెను కలిపి తీసుకోవడం కూడా కిడ్నీల ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.
కిడ్నీ వ్యాధులకు దారితీసే ముప్పు కారకమైన అధిక రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ అదుపులోకి ఉంచుకోవాలి.
ఇక తరచూ డేట్స్ తీసుకోవడం కూడా కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
డేట్స్‌లో ఉండే మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ఫైబర్ కిడ్నీలను సంరక్షిస్తాయి.