Microorganism on Venus : శుక్రగ్రహంపై సూక్ష్మజీవుల సంచారం!
Microorganism on Venus : మీరు చదివింది నిజమే. భూమికి దగ్గర ఉండే శుక్రగ్రహంపై సూక్ష్మజీవుల సంచారం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.
ఇన్నాళ్లూ అరుణగ్రహం, చంద్రుడి మీద జీవం ఆనవాళ్ల కోసం ప్రయోగాలు జరుగుతున్నా వాటిల్లో పెద్దగా పురోగతి కన్పించడం లేదు.
అందుకే కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు శుక్రగ్రహంపై దృష్టి సారించారు.
వీరికి కరోనా వచ్చే అవకాశాలు తక్కువట..
వాట్సప్‌లో ఎవరు బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవచ్చు..
భూమికి దగ్గరగా ఉండటం.. పరిమాణం కూడా భూమి అంతే ఉండటం, పైగా ఆ గ్రహంపై అగ్ని పర్వతాల జాడను గతంలో జరిగిన అనేక పరిశోధనల్లో పరిశోధకులు తేల్చారు.
అక్కడి మేఘాల్లో ఫాస్పైన్
శుక్రుడిపై ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్పైన్ అణువులు ఉన్నట్టు కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించడం చర్చకు దారితీసింది.
సాధారణంగా ఆక్సిజన్ లేని ప్రాంతంలో నివసించే సూక్ష్మజీవులు ఫాస్పైన్‌ను విడుదల చేస్తుంటాయి.
శుక్రుడిపై ఫాస్పైన్ అణువులను గుర్తించడం అంటే అక్కడ సూక్ష్మజీవులు సంచారం ఉన్నట్లేనని పరిశోధకులు భావిస్తున్నారు.
చిలీలోని అటాకామా ఎడారిలోని టెలిస్కోప్‌లను ఉపయోగించి శుక్రగ్రహం ఉపరితం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని క్లౌడ్ డెక్‌ను పరిశీలించడం ద్వారా ఫాస్పైన్ జాడను తెలసుకున్నారు.
మీ పేరు మీద ఉన్న ఫోన్ నెంబర్లు తెలుసుకోండి.. తీసేయండి ఇలా..
మండే స్వభావం ఉన్న పాప్ఫైన్ భూమిపై సేంద్రీయ పదార్థాలు విచ్ఛిన్నం నుంచి వెలువడుతుంది.
అయితే ఈ వాదనను వ్యతిరేకించే వారు ఉన్నారు. ఫాస్ఫైన్ ఉన్నంత మాత్రాన ఆ గ్రహం మీద జీవం ఉందని చెప్పలేమని,
పాస్ఫైన్ సమృద్ధిగా ఉన్నప్పటికీ జీవం మనుగడకు అవసరమైన ఇతర మూలకాలు అక్కడ లేకపోవచ్చని
కార్డిఫ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీకి చెందిన లీడ్ రచయిత జేన్ గ్రీవ్స్ అభిప్రాయపడ్డారు.
కానీ భూమి కాకుండా ఇతర గ్రహాలపై మీద ఫాస్ఫైన్‌ను కనుగోనడం ఇదే మొదటిసారన్నారు.