Homeఅంతర్జాతీయంCM రేవంత్ రెడ్డి ఇంటికి RTC ఉద్యోగులు.. ఎందుకంటే..?

CM రేవంత్ రెడ్డి ఇంటికి RTC ఉద్యోగులు.. ఎందుకంటే..?

సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. తమ బాధను చెప్పుకునేందుకు సీఎంను కలిసేందుకు తరలివచ్చారు. కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురు కార్మికులకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ RTCలో ఉద్యోగాలు.. త్వరపడండి..

గత ప్రభుత్వం హయాంలో చిన్న చిన్న పొరబాట్లకు కూడా ఉద్యోగాలు తీసేశారని వాపోయారు. అనారోగ్యం రీత్యా సెలవులు తీసుకున్నా.. టైర్ పంక్చర్ చేసినా ఇలా చిన్న చిన్న కారణాలతో 1000 మందికి పైగా కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: పాపం.. సీఎం రేవంత్ ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్..

తమ సమస్యులు చెప్పుకునేందుకు ఎండీ సజ్జనార్ ఆఫీస్ కు కాదు కదా.. కనీసం ఆర్ఎం ఆఫీసుకు కూడా రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు పోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకొని ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు.

ఇది కూడా చదవండి: KTR సంచలన వ్యాఖ్యలు.. హామీలు అమలు చేయకపోతే నడిరోడ్డుపై..

Recent

- Advertisment -spot_img