Pimples : మొటిమలను తగ్గించే అద్భుత చిట్కా
Pimples : ప్రస్తుత తరుణంలో అనేక హార్మోన్ల మార్పులు, ఇతర కారణాల వల్ల స్త్రీలకే కాదు, పురుషులకూ మొటిమలు వస్తున్నాయి.
చాలా మందిని మొటిమల సమస్య వేధిస్తోంది.
అయితే మన ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే మొటిమలను చాలా త్వరగా, సులభంగా తగ్గించుకోవచ్చు.
అందుకు ఏం చేయాలంటే..
రాత్రి నిద్రించే ముందు ముఖాన్ని బాగా కడిగి మొటిమలపై టూత్‌పేస్ట్‌ను రాయాలి.
ఉదయం పేస్ట్‌ను కడిగేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా మొటిమలు తగ్గుతాయి.
నీటిని బాగా మరిగించి దాన్నుంచి వచ్చే ఆవిరిని ముఖానికి పట్టించాలి.
అనంతరం ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా రోజూ చేస్తే.. మొటిమలు త్వరగా తగ్గుతాయి.
మొటిమలపై గుడ్లలోని తెల్లసొన అప్లై చేసి కొంత సేపు అలాగే ఉంచి తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.
రోజుకు 3 సార్లు ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే మొటిమలు పోతాయి.
అల్లం రసాన్ని మొటిమలపై రాసి కొంత సేపైన తరువాత కడిగేయాలి.
ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలను తగ్గించుకోవచ్చు.
మంచు ముక్కులను ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి దాన్ని మొటిమలపై రాయాలి.
ఇలా రోజూ చేస్తే మొటిమల సమస్య నుంచి బయట పడవచ్చు.
రాత్రి నిద్రించడానికి ముందు ముఖాన్ని బాగా కడిగి మొటిమలపై టాల్కం పౌడర్‌ను అప్లై చేయాలి.
ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో మొటిమలు త్వరగా తగ్గుతాయి.