Homeఆంధ్రప్రదేశ్Movie Ticket Rates : చౌదరి(నాని) అంటూ కులాన్ని లాగుతున్నారు

Movie Ticket Rates : చౌదరి(నాని) అంటూ కులాన్ని లాగుతున్నారు

Movie Ticket Rates : ఘంటా నవీన్ బాబు చౌదరి(నాని) అంటూ కులాన్ని లాగుతున్నారు

Movie Ticket Rates : ఏపీలో వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఇప్పటికే ప్రభుత్వం టికెట్ రేట్లు బాగా తగ్గించేసింది. మరోవైపు టికెట్లను కూడా తామే అమ్ముతామని ప్రకటించింది.

సామాన్యులకు అందుబాటులో ఉండాలనే తాము టికెట్ రేట్లు తగ్గించామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

ఏపీలో ఉన్న కొత్త టికెట్ రేట్లు చూస్తే 1990వ దశకంలో ఏ టికెట్ రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే టికెట్ రేట్లు ఉన్నాయి.

Fish Head Benefits : చేప త‌ల ముక్క‌లు తినే వారికే ఓ లెవ‌ల్ ప్ర‌యెజ‌నాలు

Always Be Young : ఎప్పుడూ యవ్వనంగా ఉండండిలా…

ఈ రేట్లతో తాము సినిమాలు రిలీజ్ చేయలేమని సినిమా వాళ్ళు … డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు చెబుతున్నారు.

మరోవైపు నోరు తెరిచి జగన్ ప్రభుత్వాన్ని అడిగే సాహసం పెద్ద హీరోలు కూడా చేయలేకపోతున్నారు.

అఖండ – పుష్ప లాంటి సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా ఏపీలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు ఎందుకు రాలేదంటే అందుకు కారణం టికెట్ రేట్లు తక్కువగా ఉండటమే అని చెప్పాలి.

ఇలాంటి సమయంలో నేచురల్ స్టార్ నాని ధైర్యంగా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

పది మందిని బ్రతికిస్తున్న థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపు వాడికి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని సెటైర్ వేశారు.

దీనిపై ఏపీ మంత్రులు ఇప్పటికే కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు.

Curd Side Effects: కొంద‌రు పెరుగు అస్సలు తినకూడదు.. మీరు తినొచ్చా

No to Onion : పూజలున్న‌ప్పుడు వంట‌ల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు వాడ‌రు

నట్టికుమార్ లాంటి నిర్మాతలు కూడా నానీదే తప్పు అని… నాని వెంటనే ఏపీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక హీరోలు సందీప్ కిషన్ – సిద్ధార్థ లాంటి వాళ్లు కూడా నానికి సపోర్ట్ చేస్తున్నారు.

ఇక ఈ విషయం లో కి నాని కులాన్ని కూడా బయటకు లాగుతున్నారు.

గంటా నవీన్ బాబు చౌదరి తాను తీసుకున్న రెమ్యునరేషన్‌ తో పాటు.. అతడు కట్టిన ట్యాక్స్ కూడా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక వైసీపీ వాళ్లే కాకుండా ఇండస్ట్రీలో కూడా కొందరు నానిని తప్పు పట్టడమే ఆశ్చర్యంగా ఉంది.

జగన్ చేసింది తప్పు కానప్పుడు వాళ్లు నాని చేసింది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారో ? పైగా నాని ధైర్యంగా ప్రశ్నించినందుకు కులం అంటగడుతున్నా ఎందుకు నోరు మొదపడం లేదో ? వారికే తెలియని పరిస్థితి.

Healthy Juice : రాత్రి పడుకునే ముందు ఈ జ్యూస్​ తాగితే రోగాలన్నీ దూరం

Pain Killer : ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి నొప్పి నుంచి అయినా రిలీఫ్‌

మోహన్‌బాబు, పృథ్వి, జీవిత, హేమ, రాజా, పోసాని లాంటి వాళ్లు గత ఎన్నికల్లో జగన్‌కు సపోర్ట్ చేశారు.

ఇప్పుడు తెలంగాణతో పోల్చి చూసినా అక్కడ సినిమా వాళ్లకు ఇస్తోన్న సౌకర్యాలు ఏపీలో కూడా ఇవ్వాలని ఎందుకు అడగ లేకపోతున్నారో ? వారికే తెలియాలి.

పైగా జగన్ చేసింది అంతా కరక్టే అంటూ.. ఇప్పుడు నానికి పేరు చివర కులం తోక తగిలించి విమర్శ చేయడం విడ్డూరంగా మారింది.

Recent

- Advertisment -spot_img