Homeతెలంగాణపెద్దగా సమ్మతి..కొద్దిగా అసమ్మతి

పెద్దగా సమ్మతి..కొద్దిగా అసమ్మతి

– అక్కడక్కడా గొంతెత్తుతున్న అసంతృప్తులు
– అధినేత మీద మాత్రం నో కామెంట్స్​
– కార్పొరేషన్​, ఎమ్మెల్సీ పదవుల కోసమే అలకలు
– అధిష్ఠానం బుజ్జగించకపోతుందా.. అని వెయిటింగ్​
– ఉప్పల్​లో బొంతు, స్టేషన్​ ఘన్​ పూర్​ లో రాజయ్య, పాలేరులో తుమ్మల అసంతృప్తి
– రంగంలోకి హైకమాండ్​.. కొనసాగుతున్న బుజ్జగింపులు

ఇదేనిజం, స్పెషల్ బ్యూరో: బీఆర్ఎస్​ ఫస్ట్​ లిస్ట్​ బయటకు వచ్చికా భారీగా అసమ్మతి ఉంటుందని అంతా భావించారు. ఇతర పార్టీల్లోకి భారీగా చేరికలు ఉంటాయని ఊహించారు. కానీ అనూహ్యంగా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి.. బీఆర్ఎస్​ అధినేత అసమ్మతి విషయంలో సక్సెస్​ సాధించారు. ఇక అక్కడక్కడా నేతలు గొంతెత్తుతున్నప్పటికీ లోకల్​ లీడర్స్ మీద కోపం తప్ప.. పార్టీ అధిష్ఠానం మీద పెద్దగా విమర్శలు గుప్పించడం లేదు. తాము అసమ్మతి వ్యక్తం చేస్తే కార్పొరేషన్​ పదవో.. ఎమ్మెల్సీ పదవో వస్తుందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్​ లో ఎక్కడా టికెట్ల పంచాయితీ లేకుండా అంతా సజావుగా ఉండటంతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. తొలుతు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మైనంపల్లి హనుమంతరావు సైతం ప్రస్తుతం చల్లబడ్డట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి పెద్ద స్థాయిలో ఇతర పార్టీల్లో చేరికలు ఉంటాయని భావించినా ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. రేఖానాయక్​, వేముల వీరేశం మినహా నేతలెవరూ ప్రస్తుతం పక్కచూపులు చూడటం లేదు. ఒకటి రెండు చోట్ల మాత్రమే టికెట్స్ పొందిన అభ్యర్థుల విజయవకాశాలను ప్రభావితం చేసే స్థాయి నాయకులు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. మిగిలిన చోట్ల షరామాములే.

మైనంపల్లి చల్లబడ్డట్టేనా?
బీఆర్ఎస్​ టికెట్​ రాకముందే మైనంపల్లి హనుమంతరావు ఆ ఆపార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక మైనంపల్లికి సొంత పార్టీ నేతలు, అనుచరుల నుంచి మద్దతు దక్కలేదు. తిరుపతిలో నోటికొచ్చినట్టు మాట్లాడిన మైనంపల్లి.. ఆ తర్వాత చల్లబడ్డారు. తన కుమారుడు మైనంపల్లి రోహిత్​ టికెట్​ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు టికెట్​ దక్కదని తెలిసి నోరుజారారు. ఇక ఇటీవల మెదక్​ బహిరంగసభలో సైతం కేసీఆర్​ మాట్లాడుతూ.. మెదక్​ అభ్యర్థి పద్మా దేవేందర్​ రెడ్డి తన కూతురి లాంటిందని .. ఆమెను గెలిపించాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ అధిష్ఠానం సైతం మైనంపల్లి విషయంలో ఆగ్రహంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మైనంపల్లి మీద కేసీఆర్​ గుర్రుగా విన్నట్టు తెలిస్తుంది. సస్పెన్షన్ తప్పదనే బీఆర్ఎస్​ వర్గాల భోగట్టా.

ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తనకు టికెట్​ దక్కకపోవడంతో అలకబూనారు. ఆయన బహిరంగంగా బీఆర్ఎస్ అధినేత మీద ఒక్కమాట కూడా మాట్లాడలేదు గానీ.. ఆయన అనుచరులు కొంత హడావుడి చేశారు. ఎంపీ నామా నాగేశ్వర్​ రావు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. తుమ్మల వ్యవహారం దాదాపు సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారకుండా.. ఎమ్మెల్సీ పదవో.. కార్పొరేషన్​ పదవో వస్తుందని తుమ్మల ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బొంతు రామ్మోహన్​ సైతం కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే బొంతు కూడా ఒకటి రెండ్రోజుల్లో చల్లబడేటట్టే కనిపిస్తోంది.

మదన్​ రెడ్డి కోసం కార్యకర్తల మీటింగ్​..
మరోవైపు మెదక్ జిల్లా నర్సాపూర్​లో మదన్​ రెడ్డి కి టికెట్​ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు డిమాండ్​ చేస్తున్నారు. సీఎం కేసీఆర్​ నర్సాపూర్​ స్థానాన్ని పెండింగ్​ లో ఉంచిన విషయం తెలిసిందే. ఇక్కడ సునీతా లక్ష్మారెడ్డికి టికెట్​ దక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో మదన్​ రెడ్డి వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. ఇక కోదాడలో బొల్లం మల్లంయాదవ్​ కు వ్యతిరేకంగా కోరుకంటి చందర్​ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఇద్దరు లీడర్లు కూడా నేరుగా అధిష్ఠానంపై విమర్శలు చేయడం లేదు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపుపై పెద్దగా అసంతృప్తి వ్యక్తం కావడం లేదు.

Recent

- Advertisment -spot_img