Homeతెలంగాణహు‘షా’రు ఏదీ?

హు‘షా’రు ఏదీ?

– జోష్​ లేని అమిత్​ షా సభ
– ఎన్నికలు హామీలు ఇవ్వకుండా సభ
– కాంగ్రెస్​, బీఆర్ఎస్​, ఎంఐంపై విమర్శలకు పరిమితం
– ప్రజాకర్షక పథకాలతో దూసుకెళ్తున్న కాంగ్రెస్​, బీఆర్ఎస్​
– బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటేనని జోరుగా ప్రచారం

ఇదేనిజం, స్పెషల్ బ్యూరో: చాలా గ్యాప్​ తర్వాత బీజేపీ కీలక నేత, కేంద్రహోంమంత్రి అమిత్​ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. నిజానికి ఈ సభ మీద కాషాయదళం చాలా ఆశలు పెట్టుకున్నది. గతంలో వివిధ కారణాల వల్ల ఖమ్మం సభ వాయిదా పడింది. దీంతో శ్రేణులు నిరాశకు గురయ్యాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర నేతలు అంతా పూనుకొని ఎట్టకేలకు ఖమ్మంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కాషాయపార్టీలో జవసత్వాలు నింపుతుందని అంతా భావించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వీక్​ అయిన కాషాయపార్టీ ఇంకా కోలుకోవడం లేదు. ఓ వైపు బీజేపీ స్టేట్​ చీఫ్​ ను మార్చడం.. మరోవైపు బీజేపీ, బీఆర్ ఎస్​ ఒక్కటేనని జోరుగా ప్రచారం జరగడంతో ఆ పార్టీ వీక్​ అయ్యింది. బీజేపీ పెద్దలు కూడా పెద్దగా ఫోకస్​ చేయడం లేదన్న టాక్​ ఉంది.

షా సభతో జరిగిందేంటి?
అమిత్​ షా సభతో బీజేపీ రాష్ట్రంలో పుంజుకుంటుందని కాషాయ కార్యకర్తలు భావించారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ సంక్షేమ పథకాలనే ఎక్కువగా నమ్ముకున్నాయి. దీంతో బీజేపీ కూడా ఏవైనా సంక్షేమ పథకాలను అనౌన్స్​ చేస్తుందేమోనని అనుకున్నారు. కానీ అమిత్​ షా మాత్రం బీఆర్ఎస్​, కాంగ్రెస్​, ఎంఐఎం పార్టీలను విమర్శించేందుకు పరిమితమయ్యారు. తప్ప ఒక్క సంక్షేమ పథకం కూడా అనౌన్స్​ చేయలేదు.

కాంగ్రెస్​, బీఆర్ఎస్​, ఎంఐఎంని టార్గెట్​ చేసిన షా
చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటేనని జోరుగా ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని అందులో భాగంగానే లిక్కర్​ స్కామ్​ కేసును నీరు గార్చి.. బీజేపీ పెద్దలు కవితను సేవ్​ చేశారని.. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ను తప్పించడం కూడా ఒప్పందంలో భాగమేనని జోరుగా ప్రచారం సాగింది. దీంతో తాజాగా అమిత్​ షా .. బీఆర్ఎస్​ ను టార్గెట్​ చేశారు. తాము ఎప్పటికీ బీఆర్ఎస్​ తో జత కట్టమని ఖమ్మం వేదికగా ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్​ తో తాము ఎందుకు కలిసి పనిచేస్తామని ఆయన ఖమ్మం సభలో అన్నారు. మొత్తం బీఆర్ఎస్​, బీజేపీ ఒక్కటి కాదని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు షా ట్రై చేశారు. కానీ ప్రజలను ఆకట్టుకొనేలా పెద్దగా హామీలు ఇవ్వలేదు. మరి షా సభతో బీజేపీలో ఎంత జోష్​ వస్తుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img