HomeతెలంగాణJeevan Reddy :ఏకకాలంలో రుణమాఫీ చేయాలి

Jeevan Reddy :ఏకకాలంలో రుణమాఫీ చేయాలి

ఏకకాలంలో రుణమాఫీ చేయాలి

  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఇదే నిజం, స్టేట్ బ్యూరో: రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణమాఫీ గుర్తుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో పాయింట్ వద్ద మాట్లాడారు. రూ.36 వేలలోపు బకాయిలు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. విడతల వారిగా రైతు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో ప్రకటించారని.. ఆ విధంగా ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తి కావాలన్నారు. రుణమాఫీ లేట్ కావడం వల్ల వడ్డీ పెరిగిందని… రుణమాఫీ మొత్తం వడ్డీకే సరిపోతుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని.. ఆ తర్వాత రుణమాఫీ చేస్తామని దాటవేసే అవకాశం లేకపోలేదన్నారు. రైతుల నమ్మకాన్ని కేసీఆర్ కోల్పోయారన్నారు.

Recent

- Advertisment -spot_img