Homeజాతీయంనింగిలోకి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌

నింగిలోకి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌

– ఎల్‌1 దిశ‌గా దూసుకెళ్లిన ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్‌

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం ఉద‌యం 11.50 నిమిషాల‌కు ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్‌తో రాకెట్ నింగిలోకి వెళ్లింది. లిఫ్ట్ ఆఫ్ నార్మ‌ల్‌గా సాగింది. సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌1 మిష‌న్‌ను ఇస్రో చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. లాంచ్ వెహికిల్ ప్ర‌జ్వ‌ల‌నం అన్ని ద‌శ‌ల్లోనూ నిర్దేశితంగా జ‌రిగింది. ఏడు పేలోడ్స్‌తో ఆదిత్య .. సూర్యుడి దిశ‌గా వెళ్తున్న విష‌యం తెలిసిందే. భూమికి 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ వ‌ద్దకు ఆదిత్య వెళ్తోంది. అక్క‌డ నుంచి సూర్యుడిని ఆ స్పేస్‌క్రాఫ్ట్ స్ట‌డీ చేయ‌నున్న‌ది. ఇట‌లీ శాస్త్ర‌వేత్త లాంరేంజ్ పేరు ఆధారంగా ఆ పాయింట్‌కు నామ‌క‌ర‌ణం చేశారు. జేమ్స్ 2 టెలిస్కోప్‌ను లాంగ‌రేంజ్2 పాయింట్ వ‌ద్ద ఫిక్స్ చేశారు. అయితే ఆదిత్య ఎల్‌1 పాయింట్ వ‌ద్ద ఫిక్స్ చేయ‌నున్నారు. దీన్నే వాంటేజ్ పాయింట్ అంటారు. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌ను ఇక్క‌డ నుంచి అధ్య‌య‌నం చేయ‌డం సుల‌వుతుంది.

Recent

- Advertisment -spot_img