జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా రూపొందుతోంది. సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రను ప్రధానంగా చేసుకుని వదిలిన గ్లింప్స్ ఇది. యూట్యూబ్ లో ఈ గ్లింప్స్ దూసుకుపోవడం మొదలుపెట్టింది. వ్యూస్ పరంగా చూసుకుంటే చకచకా అంకెలు మారిపోతున్నాయి.
ఇక లైక్స్ ప్రవాహంలో గ్లింప్స్ దూసుకెళ్తుంది. 1 మిలియన్ కి పైగా లైక్స్ ను రాబట్టుకుంది. సముద్రపు దొంగలు ఎటాక్ చేయడం .. వాళ్లపై కథానాయకుడు విరుచుకుపడటం ఈ గ్లింప్స్ లో చూపించారు. వెన్నెల రాత్రిలో కథానాయకుడిపై చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. చివర్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కంటెంట్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యాక్షన్ .. ఎమోషన్ .. లవ్ .. రొమాన్స్ ను కోలుకుంటూ నడిచే ఈ సినిమాను, ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. ఈ సినిమా కొత్త రికార్డులను బద్దులు కొడుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.