Homeజిల్లా వార్తలుఅయోధ్యకు 1000 ప్రత్యేక రైళ్లు

అయోధ్యకు 1000 ప్రత్యేక రైళ్లు

– ఆలయం ప్రారంభోత్సవం నుంచి 100 రోజుల పాటూ..
– రైల్వే శాఖ కీలక నిర్ణయం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: అయోధ్యలోని రామమందర ఆలయానికి వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ 1000 ప్రత్యేక రైళ్లను నడపబోతున్నది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
వచ్చే ఏడాది జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి వంద రోజుల పాటు అయోధ్యకు 1000కి పైగా రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు ప్రకటించాయి. మందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందే అంటే.. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఈ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. వంద రోజుల పాటు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, నాగ్‌పుర్‌, లఖ్‌నవూ, జమ్మూ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి అయోధ్యకు రైళ్లు నడపనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

Recent

- Advertisment -spot_img