Homeహైదరాబాద్latest News10th Class Results: టెన్త్ ఫలితాల పూర్తి వివరాలు ఇవే..

10th Class Results: టెన్త్ ఫలితాల పూర్తి వివరాలు ఇవే..

తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 91.31 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 4,91,862 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో 99.05 శాతంతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 98.65 శాతంతో సిద్దిపేట 2వ స్థానంలో, 98.27 శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా 3వ స్థానంలో నిలిచాయి. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఆరు పాఠశాలల్లో సున్నా శాతం నమోదైంది. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశం తెలిపారు. మే 16 నుంచి పరీక్ష వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రీ వెరిఫికేషన్ కోసం 15 రోజుల్లోగా రూ. 500 చెల్లించాలని తెలిపారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://results.bsetelangana.org/

Recent

- Advertisment -spot_img