Homeహైదరాబాద్latest NewsSpiceJet​ కంపెనీలో 1400 ఉద్యోగాలు గల్లంతు

SpiceJet​ కంపెనీలో 1400 ఉద్యోగాలు గల్లంతు

ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నా చాలా కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్‌ స్పైస్ జెట్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న సిబ్బందిలో 1400 మందిని తొలగిస్తున్నట్లు బాంబు పేల్చింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 15 శాతంగా ఉంటుందని తెలిపింది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నట్లు కనిపిస్తున్న దేశీయ విమానయాన రంగంలో స్పైస్ జెట్ లేఆఫ్స్ ప్రకటనతో ఈ రంగంలోని పరిస్థితులను తెలియజేస్తుందని ఎయిర్‌లైన్స్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ లో 9 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 30 విమానాలు సేవలందిస్తున్నాయి. అందులో విదేశీ విమానయాన సంస్థల నుంచి 8 విమానాలు, పైలట్లు, సిబ్బందితో పాటు అద్దెకు తీసుకుని నడిపిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ నగదు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతలు చేపట్టాల్సి వచ్చినట్లు తెలిపింది. ఉద్యోగుల జీతాలే 60 కోట్లు దాటుతున్న క్రమంలో తప్పనిసరిగా సిబ్బంది తగ్గింపు చేపట్టాల్సిన అవసరం ఏర్పడినట్టు పేర్కొంది. లేఆఫ్స్ లో ప్రభావితమవుతోన్న సిబ్బందికి ఇప్పటికే కాల్స్ వెళ్తున్నట్టు స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Recent

- Advertisment -spot_img