Homeహైదరాబాద్latest Newsశబరిమలకు 22 Special Trains

శబరిమలకు 22 Special Trains

– తెలుగు రాష్ట్రాలను కలుపుతూ సర్వీసులు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: శబరిమల క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లే భక్తజనం కోసం దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ మొత్తం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఆయా రైళ్లు సర్వీసులందించే రైళ్ల తేదీలు, టైమింగ్స్‌, తదితర వివరాలను సోమవారం విడుదల చేసింది. సికింద్రాబాద్‌- కొల్లం, నర్సాపుర్‌-కొట్టాయం, కాచిగూడ-కొల్లం; కాకినాడ టౌన్‌ -కొట్టాయం; కొల్లం -సికింద్రాబాద్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నిర్దేశించిన రోజుల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సెకెండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img