Homeతెలంగాణఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు

ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు

– ఎల్​బీనగర్​లో అత్యధికంగా 48 మంది పోటీ
– నామినేషన్లను విత్​ డ్రా చేసుకున్న 608 మంది
– ప్రకటించిన ఎన్నికల కమిషన్

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు మిగిలారు. బుధవారం 608 మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ చీఫ్​, సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. గజ్వేల్​లో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సీఎం పోటీ చేస్తున్న మరో నియోజకవర్గమైన కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు. ఎల్‌బీ నగర్‌లో అత్యధికంగా 48 మంది, పాలేరులో 37, కోదాడలో 34, నాంపల్లిలో 34, ఖమ్మంలో 32, నల్గొండలో 31, కొత్తగూడెంలో 30 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో ఎన్నికల ప్రచారం ఇక మరింత జోరు అందుకోనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 30వ తేదీన పోలింగ్‌ జరగనుండగా.. 28న ప్రచారం ముగియనుంది. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు

Recent

- Advertisment -spot_img