Homeసినిమా11 రోజుల్లో 25.5 మిలియన్ Views

11 రోజుల్లో 25.5 మిలియన్ Views

బాలీవుడ్ బాద్​షా షారుఖ్ ఖాన్​తో దర్శకుడు అట్లీ తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ ‘జవాన్’. మరి ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా షారుఖ్ కెరీర్​లోనే మరో బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది. రీసెంట్​గానే ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యింది. నెట్​ఫ్లిక్స్​లో ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మొదటి వీకెండ్​లోనే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్​ను సొంతం చేసుకుంది. నెట్​ఫ్లిక్స్​లోకి వచ్చిన 11 రోజుల్లో ఏకంగా 25.5 మిలియన్
వ్యూస్​ను జవాన్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఓటీటీలో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఈ సినిమానే హయెస్ట్ వ్యూస్​తో ఇప్పుడు దూసుకెళ్తోంది. ఈ సినిమాలో నయనతార, దీపికా పడుకునే కీలక పాత్రల్లో నటించగా.. అనిరుద్ సంగీతం అందించాడు.

Recent

- Advertisment -spot_img