Homeఅంతర్జాతీయంరెండో సారి కూడా కరోనా సోకుతుంది...

రెండో సారి కూడా కరోనా సోకుతుంది…

కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులు కోలుకున్న తర్వాత మళ్లీ ఇక తమకు కరోనా రాదు అనుకోవడం మూర్ఖత్వమే. ఇలా అనుకునే చాలా మంది తరువాత సరైన జాగ్రత్తలు వహించడం లేదు. అయితే కరోనా మహమ్మారి బారిన రెండోసారి పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్‌కు చెందిన పరిశోధకులు ఇలాంటి కేసులను గుర్తించారు. మార్చి నెలలో ఓ వ్యక్తికి కరోనా సోకి తిరిగి అతను కోలుకున్నాడు. తిరిగి అతనికే ఓ చోట స్కాన్​ చేయగా కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో కరోనా ఒకసారి వచ్చి పోయింది మళ్ళి ఎలా వస్తుంది అని అతన్ని స్కాన్​ చేసిన వ్యక్తిని ప్రశ్నించాడు. దీంతో తిరిగి పరీక్షలకు పంపగా అతనికి కరోనా వచ్చినట్లు నిర్ధారణ చేశారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇమ్యూనిటీ జీవిత కాలం ఉండదనడానికి ఇది నిదర్శనమని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా ఎంత మంది రెండోసారి కరోనా బారిన పడుతున్నారో మనకు తెలీదన్నారు. కరోనా సోకి తగ్గిన వారు తమకేం కాదులే అని నిర్లక్ష్యంగా ఉండకుండా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం లాంటివి చేయాలని పరిశోధకులు సూచించారు.

Recent

- Advertisment -spot_img