Homeహైదరాబాద్latest News30 తులాల బంగారు ఆభరణాలు చోరీ

30 తులాల బంగారు ఆభరణాలు చోరీ

karimnagar : సొరంగాపూర్ మండలంలోని పోతారంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..బీర్‌పూర్ మండలంలోని తుంగూర్‌కు చెందిన ఉయ్యాల మల్లేశ్ తొమ్మిదేళ్లుగా పోతారంలో ఉంటున్నాడు. ఆర్‌ఎంపీగా పనిచేస్తూ కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. సోమవారం స్వగ్రామమైన తుంగూర్‌కు కుటుంబసభ్యులతో వెళ్లి మంగళవారం వచ్చి చూసేసరికి తాళం తీసి ఉంది. ఇంట్లో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 వేల నగదు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img