తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే, ఎండలు మళ్లీ గరిష్ఠానికి చేరుకుంటాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. అయితే, వచ్చే నాలుగు రోజులు మాత్రం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది.