ముంబై వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 174 పరుగులకు ఆలౌటైంది. భారత్కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విల్ యంగ్ 51 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా 5, అశ్విన్ 3 వికెట్లు.. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 235, భారత్ 263 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది.