Homeతెలంగాణతెలంగాణలో 70.74 శాతం పోలింగ్

తెలంగాణలో 70.74 శాతం పోలింగ్

– రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి
– డిసెంబర్​ 3న ఫలితాలు వెల్లడిస్తాం
– రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​ రాజ్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా పోల్ అయ్యాయని తెలిపారు. శుక్రవారం పోలింగ్‌కు సంబంధించిన వివరాలను వికాస్ రాజ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 70.74 శాతం పోలింగ్ నమోదైందన్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో పోలింగ్‌ 3 శాతం తగ్గిందన్నారు. 2018లో 73.37 శాతం పోలింగ్‌ నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో లక్షా 80 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారన్నారు. ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని వికాస్‌ రాజ్‌ పేర్కొన్నారు. ఎన్నికల కోసం 2 లక్షల కంటే ఎక్కువ మంది సిబ్బంది కష్టపడ్డారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని చోట్ల పోలింగ్​ సజావుగా సాగిందని, ఎక్కడ రీపోలింగ్‌కు అవకాశం లేదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్​ నమోదైందని, హైదరాబాద్‌లో అత్యల్పంగా 46.56 శాతం పోలింగ్‌ జరిగిందన్నారు.

Recent

- Advertisment -spot_img