Homeఫ్లాష్ ఫ్లాష్ప్రముఖ బ్రాండ్ల తేనెల్లో 77 శాతం కల్తీవే.. సీఎస్‌ఈ వెల్లడి

ప్రముఖ బ్రాండ్ల తేనెల్లో 77 శాతం కల్తీవే.. సీఎస్‌ఈ వెల్లడి

న్యూఢిల్లీ: డైలీ తేనె తీసుకునే అలవాడు ఉందా.. మీరు తీసుకునే తేనె స్వచ్ఛమైందనే మీరు నమ్ముతున్నారా.. మీ అంచనాలు తప్పే అవకాశం ఉంది.

మార్కెట్లో లభించే తేనెల్లో దాదాపు 77 శాతం కల్తీవే అని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) తెలిపింది. వీటిని వివిధ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లో వినియోగదారులకు అంటగడుతున్నట్లు పేర్కొన్నారు.

కల్తీ తేనె విక్రయాల్లో ఇండియాకు చెందిన 13 ప్రముఖ, సాధారణ బ్రాండ్లకు సంబంధించిన ఉన్నట్లు సీఎస్‌ఈ ప్రకటించింది.

77% of honey of popular brands is adulterated .. CSE revealed
ఇండియాలోని ప్రముఖ బ్రాండ్లకు చెందిన తేనె నుంచి మొత్తం 22 శాంపిల్స్‌ను పరీక్షించగా 77 శాతం తేనెలు పంచదార పాకంతో కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. కేవలం ఐదు బ్రాండ్లు మాత్రమే అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయని వారు వివరించారు.

ఇండియాలో ఓకే.. జర్మనీలో నో..

గుజరాత్‌లోని పశువుల ఆహార, అభ్యసన కేంద్రం (సీఏఎల్‌ఎఫ్‌), కర్ణాటకలోని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ)లో ఈ శాంపిళ్లను ముందుగా పరీక్షించగా అన్నీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయన్నారు.

కానీ వాటిని జర్మనీలోని ఓ ప్రత్యేక ల్యాబరేటరీలో న్యూక్లియర్‌ మాగ్నటిక్‌ రెసొనెన్స్‌(ఎన్‌ఎమ్‌ఆర్‌) పరీక్ష చేయించగా అవన్నీ నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో విఫలమైనట్లు ఆ ఫలితాల్లో వెల్లడైందని సీఎస్‌ఈ ప్రోగ్రామ్‌ డైరక్టర్‌ అమిత్‌ ఖురానా తెలిపారు.

‘‘కరోనా కాలంలో ప్రజలు ఎక్కువగా తేనెను సేవించేందుకు అలవాటు పడ్డారు. కానీ ఇది ఆరోగ్యాన్నివ్వకపోగా, మరింత అనారోగ్యానికి గురి చేస్తోంది. దేశంలో నాణ్యతా ప్రమాణాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.’’అని అమిత్‌ అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img