Cervical Tumor : 3డి ప్రింటింగ్‌తో శస్త్రచికిత్స.. 7 ఏండ్ల చిన్నారికి పునర్జన్మ
Cervical Tumor : పద్మిని వయసు ఏడేళ్లు. చాలా తెలివితేటలు కలిగి, చదువులో ముందంజలో ఉంటుంది.
ఆమెకు ఎన్నో కలలున్నాయి. వాటిని నెరవేర్చుకోడానికి ఎంతో చేయాలనుకుంది.
ఆమె తండ్రి స్వీట్ల దుకాణం నడుపుతారు. అంతా సజావుగా సాగుతోందని అనుకుంటున్న తరుణంలో ఆమెకు మెడ వద్ద విపరీతమైన నొప్పి మొదలైంది.
పలు చోట్ల పరీక్షలు చేయించగా, చివరకు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళానికి అత్యంత సమీపంలో మెడ వద్ద కేన్సర్ కణితి ఏర్పడినట్లు గుర్తించారు.
విషయం తెలిసి కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
పరిష్కారం కోసం దేశంలోని పలు ఆస్పత్రులకు వెళ్లారు.
చివరకు కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital)లో కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణచైతన్యను కలిశారు.
ముందుగా కేన్సర్ కణితిని మెదడుకు వెళ్లే రక్తనాళాల నుంచి వేరు చేశారు.
తర్వాత ఒకసారి మళ్లీ సీటీ స్కాన్ చేసి ప్రమాదం ఏమీ లేదని నిర్ధారించుకుని అప్పుడు కేన్సర్ కణితిని తొలగించారు.
మెడ స్థిరంగా నిలబడేందుకు వీలుగా తర్వాత కొన్ని స్క్రూలను బిగించాల్సి వచ్చింది.
శస్త్రచికిత్స తర్వాత పాప పూర్తిగా కోలుకుని, మళ్లీ తన చదువు కొనసాగిస్తోంది.
ఈ సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ, “మెదడు రక్తనాళాలకు దగ్గరగా ఉండే సెర్వైకల్ ఆస్టాయిడ్ ఆస్టియోమస్ కణితులకు శస్త్రచికిత్స చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ.
3డి ప్రింటింగ్ సహాయంతో శస్త్రచికిత్సకు ముందు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే, కణితి మొత్తాన్ని ఒక్కటిగానే తీయడం వీలవుతుంది.
అలా ఒక్కసారే మొత్తం కణితిని తొలగిస్తే కేన్సర్ మరోసారి రాకుండా ఉండి, రోగి జీవనకాలం కూడా పెరుగుతుంది” అని వివరించారు.
ఇవి కూడా చదవండి
Trending in Social Media – Politics – Sports – Movie & More
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఇలా కనిపెట్టొచ్చు..