APలో 999 పవర్ స్టార్ సుపీరియర్ పేరుతో కొత్త విస్కీ వచ్చింది. దీనిపై YCP స్పందిస్తూ ‘‘ఇదేనా నాణ్యమైన మద్యం? ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బాబు సర్కార్’’ అంటూ ట్వీట్ చేసింది. అయితే ఏపీలో 999 పవర్ స్టార్ సుపీరియర్ పేరుతో కొత్త మద్యం తీసుకొచ్చారంటూ వైసీపీ చేసిన ట్వీట్‌పై టీడీపీ స్పందించింది. ‘‘ప్రపంచంలో ఏడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రాగోల్డ్, బూమ్ బూమ్, 999 పవర్ స్టార్ బ్రాండ్ మద్యం తీసుకొచ్చింది జగనే. జగనే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యుండి.. ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారు’’ అంటూ మండిపడింది.