పెట్రోల్ ధర నిలకడగానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా ఇదే దారిలో పయనించింది.
దేశీ ఇంధన ధరలు నిలకడగా ఉంటూ రావడం ఇది వరుసగా 14వ రోజు కావడం గమనార్హం. క్రూడ్ ధరలు పైకి చేరాయి.
పెట్రోల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. డీజిల్ ధర కూడా ఇదే దారిలో పయనించింది.
దీంతో ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు. దేశీ ఇంధన ధరలు నిలకడగా ఉండటం ఇంది వరుసగా 14వ రోజు కావడం గమనార్హం.
హైదరాబాద్‌లో శనివారం పెట్రోల్ ధర లీటరుకు రూ.105.83 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.97.96 వద్ద కొనసాగుతోంది.
అమరావతిలో అయితే పెట్రోల్ ధర రూ.107.64 వద్ద ఉంది. డీజిల్ రేటు కూడా సెంచరీకి దగ్గరిలో ఉంది. లీటరుకు రూ.99.26 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.05 శాతం పెరుగుదలతో 75.14 డాలర్లకు చేరింది.
ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.14 శాతం పెరుగుదలతో 73.72 డాలర్లకు చేరింది.
ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి.
ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.