రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో, 17, 18న పలు పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఇదిలా ఉండగా సోమవారం వేకువ జాము నుంచి పలు జిల్లాల్లో భారీ, మోస్తరు వర్షాలు కురిశాయి.
జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌లో అక్కడక్కడ భారీ వర్షాపాతం నమోదైంది.
మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.