Homeఅంతర్జాతీయంFirst One Rupee Coin in India : రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?

First One Rupee Coin in India : రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?

భారతదేశంలోకి వ్యాపారం నిమిత్తం వచ్చిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ.. ఇక్కడ సిల్క్‌, కాటన్‌, ఇండిగో, టీ, ఉప్పు వంట వస్తువుల వర్తకం కొనసాగించేది.

1640 లో మన దేశంలో దాదాపు 23 పరిశ్రమలను స్థాపించి వంద మందికి ఉపాధి కల్పించింది.

ఈ కంపెనీలు అప్పటివరకు భారతదేశం పరిపాలనలో తలదూర్చలేదు.

కానీ, 1757 లో ప్లాసీ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఈస్ట్‌ ఇండియా కంపెనీ చేతిలోకి పాలనా పగ్గాలు రావడం మొదలయ్యాయి.

ప్లాసీ యుద్దం తర్వాత బెంగాల్‌ నవాబుతో ఒప్పందం కుదుర్చుకుని నాణేలను తయారుచేయడం ప్రారంభించింది.

తొలి రూపాయి నాణెం (One Rupee Coin) 264 సంవత్సరాల క్రితం 1757 లో సరిగ్గా ఇదే రోజున జారీ చేశారు.

మన దేశంలో నాణేల తయారీ కోసం సూరత్‌, బొంబాయి, అహ్మదాబాద్‌లో మింట్‌ను ఈస్ట్‌ ఇండియా కంపెనీ నెలకొల్పింది.

సూరత్‌లో మింట్‌ ప్రారంభం అవడం జరిగినప్పటికీ.. తొలి రూపాయి నాణెం మాత్రం కోల్‌కతాలోని మింట్‌లోనే తయారైంది.

బెంగాల్‌, మద్రాస్‌, బొంబాయి ప్రెసిడెన్సీల్లో వేర్వేరు నాణేలు అందుబాటులో ఉండేవి. బరువు, రంగులో కూడా వైవిధ్యం ఉండేవి.

దాంతో నాణేలు అన్నీ ఒకేవిధంగా ఉండాలంటూ 1835 లో ఉత్తర్వులు జారీ చేయడంతో ఒకే రకం నాణేలు అందుబాటులోకి వచ్చాయి.

1857 తిరుగుబాటు తర్వాత, భారతదేశం పాలన నేరుగా బ్రిటీష్ రాజుల చేతుల్లోకి వెళ్లడంతో నాణేలపై బ్రిటీష్ చక్రవర్తి విలియం IV చిత్రాన్ని ముద్రించడం ప్రారంభించారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో వెండి కొరత కారణంగా పేపర్ నోట్లు జారీ అయ్యాయి.

1947 లో భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత 1950 వరకు అవే నాణేలు చెలామణిలో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img