TELANGANA GOVERNMENT LETTER TO KRISHNA RIVER MANAGEMENT BOARD : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
శ్రీశైలంలో ఏపీ 34 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా చూడాలని ఈఎన్‌సీ మురళీధర్ కోరారు.
880 అడుగుల పైన నీరున్నప్పుడూ ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని లేఖలో ప్రస్తవించారు.
11,150 క్యూసెక్కుల వరకు విడుదల చేసేందుకే ప్రాజెక్టు డిజైన్ చేశారని ఆరోపించారు.
శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20 వేల క్యూసెక్కులకు పెంచారని, కాలువకు వరద సమయాల్లో అంటే జులై- అక్టోబర్ మధ్య మాత్రమే నీరు వదలాలన్నారు.
34 టీఎంసీలకు మించి తీసుకోవడానికి జలసంఘం అనుమతి లేదని.. శ్రీశైలం నుంచి నీటి విడుదలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు.
పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌ఎంసీ, ఎస్కేప్ రెగ్యులేటర్, తెలుగు గంగను అనుమతిలేనిదిగా పేర్కొనాలని కోరారు.
ఏపీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను గెజిట్‌లో చేర్చాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పనులను గెజిట్ రెండో షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు.