Homeలైఫ్‌స్టైల్‌Onions : ఈ ఉల్లిగ‌డ్డ‌ల‌ను తింటే జ‌నాలు జ‌బ్బుప‌డుతున్నారా..

Onions : ఈ ఉల్లిగ‌డ్డ‌ల‌ను తింటే జ‌నాలు జ‌బ్బుప‌డుతున్నారా..

Diseases with Salmonella Infected Onions : ఈ ఉల్లిగ‌డ్డ‌ల‌ను తింటే జ‌నాలు జ‌బ్బుప‌డుతున్నారా..

ఉల్లిగ‌డ్డ‌ల‌ను తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్ద‌లు చెబుతుంటారు.

ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దంటారు.

కానీ.. ప్ర‌స్తుతం ఆ ఉల్లిగ‌డ్డ‌లను తిన‌డం వ‌ల్ల‌నే చాలామంది వ్యాధి బారిన ప‌డుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉల్లిగ‌డ్డ‌ల‌ను తిన‌డం వ‌ల్ల యూఎస్ఏలోని 37 రాష్ట్రాల్లో 652 మందికి ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి.

అందులో 129 మంది ఆసుప‌త్రి పాల‌య్యారు.

దానికి కార‌ణం వాళ్లు తిన్న‌ది సాల్మానెల్లా అనే బ్యాక్టీరియా ఉన్న ఉల్లిగ‌డ్డ‌ల‌ను తిన‌డం.

ఆ ఉల్లిగ‌డ్డ‌ల‌ను మెక్సికో నుంచి యూఎస్‌కు ఇంపోర్ట్ చేశారు.

వాటిని తిని ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చ‌నిపోలేదు కానీ.. ఆసుప‌త్రుల పాలు అవ‌డం.. ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు గురి కావ‌డంతో యూఎస్‌లో ఉల్లిగ‌డ్డ‌ల‌ను తినాలంటే అక్క‌డి ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు.

అస‌లు సాల్మానెల్లా అంటే ఏంటి?

సాల్మానెల్లా అనేది ఓ బ్యాక్టీరియా. అది ఎక్కువ‌గా ఆహార ప‌దార్థాల్లో ఉంటుంది.

వాటిని తిన‌గానే ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ బ్యాక్టీరియా ఉన్న ఫుడ్‌ను తీసుకోగానే పేగుల్లో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

త‌ద్వారా క‌డుపు నొప్పి వ‌స్తుంది. ఈ బ్యాక్టీరియా ద్వారా ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తే వాటిని సాల్మోనెల్లోసిస్ అని అంటారు.

ఈ ర‌కం బ్యాక్టీరియా ఎక్కువ‌గా జంతువుల్లో, మ‌నిషి పేగుల్లో ఉంటుంది.

బ్యాక్టీరియా మ‌ల విస‌ర్జ‌న ద్వారా బ‌య‌టికి వెళ్లి ఆహార ప‌దార్థాల్లో, నీళ్ల‌లో క‌లిసి పోయి.. తిరిగి మ‌నుషుల్లోకి చేరుతుంది.

ఈ బ్యాక్టీరియా మ‌నుషుల్లోకి చేరింద‌ని తెలుసుకోవ‌డం చాలా క‌ష్టం.

బ్యాక్టీరియాతో ఇన్‌ఫెక్ట్ అయితే వాంతులు అవ‌డం, డ‌యోరియా, జ్వ‌రం, త‌ల‌నొప్పి, క‌డుపు నొప్పి లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

5 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌లు.. 65 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న పెద్ద‌ల‌కు ఈ బ్యాక్టీరియా సోకే ప్ర‌మాదం ఎక్కువ‌.

ఈ బ్యాక్టీరియా ర‌క్త ప్ర‌వాహంలో క‌లిస్తే మాత్రం చాలా ప్ర‌మాదం.

అది మెద‌డులోని క‌ణ‌జాలాన్ని, వెన్నుముక‌ను డ్యామేజ్ చేస్తుంది.

ర‌క్త‌నాళాల‌పై కూడా ప్ర‌భావం చూపిస్తుంది. పైన చెప్పిన ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే ఆసుప‌త్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి.

అయితే.. ఉల్లిగ‌డ్డ‌ల్లో ఈ బ్యాక్టీరియా ఎలా క‌లుషితం అయిందో తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు యూఎస్ అధికారులు.

ఉల్లిగ‌డ్డల హార్వెస్టింగ్ త‌ర్వాత వాటిని గోదాముల్లో దాచే స‌మ‌యాల్లోనే సాల్మెనెల్లా బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయి ఉంటుంద‌ని అధికారులు అనుమానిస్తున్నారు.

లేదంటే ఉల్లిగ‌డ్డ సాగు స‌మ‌యంలో క‌లుషిత‌మైన నీటితో లేదా పేడ లాంటి ఎరువును వాడ‌టం వ‌ల్ల సాల్మెనెల్లా ఉల్లిగ‌డ్డ‌ల‌కు సోకి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img