Pooja Hegde achieving her dreams : తన కలను నిజం చేసుకుంటున్న పూజా హెగ్డే..
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే(Pooja Hegde) ఒకరు.
అందం, అభినయంతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు సినిమాలు చేస్తుంది.
పూజా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది.
‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుతం పూజా హెగ్డే క్రేజ్ నడుస్తుండడంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచింది.
ఇప్పుడు బాగానే సంపాదిస్తున్న పూజా హెగ్డే ముంబైలో తన కలల ఇంటిని నిర్మించడంతో ఆమె తన కలను నిజం చేసుకుంటుంది.
పూజా హెగ్డే కొత్తగా నిర్మిస్తున్న తన ఇంటి చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు.
పెయింటింగ్ పనులను పరిశీలిస్తున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ” బిల్డింగ్ మై డ్రిమ్స్” అని క్యాప్షన్ పెట్టారు.
దీపావళికి రాధేశ్యామ్(RadheShyam) నుండి పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన టీజర్ లాంటిది రాబోతోందనే టాక్ వినిపిస్తోంది.
ఇది ప్రేక్షకులకి మంచి థ్రిల్ అందిస్తుందని అంటున్నారు.
ఇక ఆచార్య నుంచి దీపావళికి పూజా హెగ్డే మీద ఏదైనా స్పెషల్ పోస్టర్ వస్తుందేమో చూడాలి.