Telangana police officer won one crore in Evaru Meelo Koteeswarulu program : ఎవరు మీలో కోటీశ్వరులులో రూ.కోటి గెలుచుకున్న ఎస్సై
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు(Evaru Meelo Koteeswarulu)` షో జెమినీ టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ షోలో ఇప్పటివరకు ఎవరూ కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకున్న దాఖలాలు లేవు.
అయితే తొలిసారిగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన ఓ ఎస్సై కోటి రూపాయలు గెలుచుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ షోకు సంబంధించి రేపటి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
అందులో డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజారవీంద్రకు హోస్ట్ ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న సంధించారు.
రాజారవీంద్ర కూడా సమాధానం చెప్పి దానిని ఫిక్స్ చేయమనడం ప్రోమోలో కనిపిస్తోంది.
అయితే ఆయన రూ. కోటి గెలిచాడని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది. ఏదైమైనా దీనిపై రేపు క్లారిటీ రానుంది.