Homeవిద్య & ఉద్యోగంPhonePe లో ఉద్యోగాలు..

PhonePe లో ఉద్యోగాలు..

PhonePe లో ఉద్యోగాలు..

కరోనా తరువాత పలు సంస్థలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకావాలను కల్పిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారతదేశం (India) లోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే (PhonePe) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్‌.. దరఖాస్తు విధానం తెలుసుకోండి.

ఫోన్‌పేలో మ్యూచ్‌వల్ ఫండ్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు..

ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మ్యూచువల్ ఫండ్స్‌ (Mutual Funds)కు సంబంధించిన కస్టమర్ల (Customers) సందేహాలను పరిష్కరించాల్సి ఉంటుంది.

అంతే కాకుండా వారికి ఫండ్స్‌కు సంబంధించి మెరుగైన అనుభవాన్నిఅందించాల్సిన బాధ్యత ఉంటుంది.

ఈ జాబ్ రోల్‌ (Job Role) లో ముఖ్యంగా వినియోగదారుల సమస్యలు వేగంగా పరిష్కరించిందేకు కృషి చేయాలి.

అందుకు అనుగుణంగా ప్లానింగ్‌ (Planning)ను అందించాలి.

దరఖాస్తుకు అర్హతలు..

– దరఖాస్తు చేసుకొనే అభ్యర్థికి 0-2 సంవత్సరాల వృత్తి అనుభవం ఉండాలి.

– అద్భుతమైన వ్రాత, మౌఖిక సంభాషణా సామర్థ్యం అవసరం.

– వినియోగదారుల సమస్యలను ఓపికగా వినాలి.

– పనికి సంబంధించిన మేనేజమెంట్ స్కిల్స్ ఉండాలి.

దరఖాస్తు విధానం..

Step 1 : దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.

Step 2 : ముందుగా అభ్యర్థులు www.phonepe.com యొక్క అధికారిక పోర్టల్‌ని సందర్శించాలి.

Step 3 : ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్‌ను పూర్తిగా చదవాలి.

Step 4 : వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే కెరీర్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.

Step 5 : అనంతరం స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

Step 6 : అభ్యర్థి లింక్డ్‌ఇన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కెరీర్ పేజీలో అందుబాటులో ఉంది.

Step 7 : అవరసమైన వివరాలను అందించి సైన్ ఇన్ అవ్వాలి. అనంతరం దరఖాస్తు ఫాంలోని అన్ని ఫీల్డ్‌లను నింపాలి.

Step 8 : దరఖాస్తు పూర్తయిన తరువాత సబ్‌మిట్ చేయాలి.

మ‌రిన్ని ఉద్యోగాల వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Recent

- Advertisment -spot_img