HomeసినిమాAkhanda Villain : అఖండ‌లో మెయిన్ విల‌న్ రియ‌ల్ లైఫ్‌లో ఎవరో తెలుసా..

Akhanda Villain : అఖండ‌లో మెయిన్ విల‌న్ రియ‌ల్ లైఫ్‌లో ఎవరో తెలుసా..

Akhanda Villain : అఖండ‌లో మెయిన్ విల‌న్ రియ‌ల్ లైఫ్‌లో ఎవరో తెలుసా..

Akhanda Villain – ‘అఖండ‌’గా నంద‌మూరి బాల‌కృష్ణ తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లోనూ ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నారు.

ఆయ‌న కెరీర్‌లోనే అత్య‌ధిక ఓపెనింగ్స్‌తో మొద‌లైన క‌లెక్ష‌న్ల జాత‌ర‌, రెండో రోజు కూడా కొన‌సాగింది.

ఈ సినిమాలో మైనింగ్ కింగ్ వ‌ర‌ద‌రాజులుగా శ్రీ‌కాంత్ విల‌నిజాన్ని పండించి ఆక‌ట్టుకోగా, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ అయిన గ‌జేంద్ర సాహు అనే మెయిన్ విల‌న్ క్యారెక్ట‌ర్‌ను ఇంత‌దాకా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేని ఓ న‌టుడు పోషించాడు.

ఆజానుబాహు రూపం, చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆ పాత్ర‌కు పూర్తి న్యాయం చేసిన ఆ న‌టుని పేరు నితిన్ మెహ‌తా. 

‘అఖండ‌’తోటే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నితిన్ మెహ‌తా ఒక మాజీ ఆర్మీ ఆఫీస‌ర్ అనే విష‌యం అతి త‌క్కువ‌మందికే తెలుసు. ఏకంగా ఆయ‌న 21 సంవ‌త్స‌రాలు ఒక సైనికునిగా దేశానికి సేవ చేశారు.

ఆయ‌న తండ్రి కూడా ఆర్మీ ఆఫీస‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఒక యాక్సిడెంట్‌లో అయిన గాయం కార‌ణంగా నితిన్ ఆర్మీకి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి వ‌చ్చింది.

అయితే ఆయ‌న‌కు అదృష్టం మ‌రో రూపంలో క‌లిసొచ్చి, ఇప్పుడున్న సెల‌బ్రిటీ స్థాయికి తీసుకొచ్చింది.

గ‌డ్డం లుక్‌తో ఎయిర్‌పోర్టులో క‌నిపించిన నితిన్ మెహ‌తాను చూసి ఒక సినిమా నిర్మాతో, ద‌ర్శ‌కుడో త‌న సినిమాలో ఓ క్యారెక్ట‌ర్‌ను ఆఫ‌ర్ చేశాడు.

అయితే ఆ సినిమాను నితిన్ చేయ‌లేదు.

కానీ ఆ ఘ‌ట‌న ఆయ‌న‌లో ఆలోచ‌న‌ను రేకెత్తించింది.

మోడ‌లింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు.

అయితే మొద‌ట ఇందుకు ఆయ‌న తండ్రి ఒప్పుకోలేదు.

సైన్యంలో ప‌నిచేసిన నువ్వు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫీల్డులోకి వెళ్ల‌డ‌మేంట‌ని ఆయ‌న అడ్డుచెప్పారు.

పోర్ట్‌ఫోలియో షూట్ కోసం వెళ్తున్న కొడుకును చూసి, డ‌బ్బు వేస్ట్ చేస్తున్నావ‌ని కోప్ప‌డ్డారు కూడా.

నితిన్ కుర్రాడేమీ కాదు, న‌డి వ‌య‌సులో ఉన్న వ్య‌క్తి.

అందువ‌ల్ల మోడ‌ల్‌గా కొడుకు రాణించ‌లేడ‌ని కూడా తండ్రి భ‌య‌ప‌డ్డారు.

కానీ ఒక‌సారి ట్రైచేసి చూస్తాన‌ని చెప్పాడు నితిన్‌.

ఆయ‌న‌ పోర్ట్‌ఫోలియో చూసి, ముంబై లాక్మే ఫ్యాష‌న్ వీక్ నుంచి ఆహ్వానం అందింది.

అలా 44 ఏళ్ల వ‌య‌సులో మోడ‌లింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు నితిన్‌.

కెరీర్ ఆరంభంలో ఆయ‌న బ‌రువు 85 కిలోలు.

రోజు రెండు గంట‌లు జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేయ‌డం ద్వారా బ‌రువును త‌గ్గించుకోవ‌డ‌మే కాకుండా, దృఢంగా త‌యార‌య్యాడు.

మోడ‌ల్‌గా స‌క్సెస్ అయిన నితిన్ మెహ‌తాకు సినిమా ఆఫ‌ర్లు రావ‌డం మొద‌లైంది.

అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి ‘ఫిలాల్‌’, ‘ఫిలాల్ 2’ మ్యూజిక్ వీడియోల్లో న‌టించాడు.

50 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ‘అఖండ’ మూవీలో డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ఇచ్చిన‌ గ‌జేంద్ర సాహు క్యారెక్ట‌ర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఈ సినిమాతో మ‌రో టాలెంటెడ్ విల‌న్ టాలీవుడ్‌కు ల‌భించాడ‌ని చెప్పాలి.

‘అఖండ’ సినిమాను నోయిడాలోని పీవీఆర్‌లో త‌న పేరెంట్స్‌తో క‌లిసి చూసిన నితిన్ మెహ‌తా ఆ ఫొటోల‌ను త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, త‌న ఆనందాన్ని పంచుకున్నాడు.

సినిమాకు వ‌చ్చిన అఖండ ఆద‌ర‌ణ‌తో పాటు త‌న న‌ట‌న‌కూ ప్ర‌శంస‌లు ల‌భిస్తుండ‌టంతో ఆనందంతో త‌బ్బిబ్బ‌వుతున్నాడు.

Recent

- Advertisment -spot_img