Homeవిద్య & ఉద్యోగంMoU between BRAOU and AOC : అంబేద్కర్ వర్శిటీ పట్టా ఇక ఆర్మీలో చెల్లుబాటు

MoU between BRAOU and AOC : అంబేద్కర్ వర్శిటీ పట్టా ఇక ఆర్మీలో చెల్లుబాటు

MoU between BRAOU and AOC : అంబేద్కర్ వర్శిటీ పట్టా ఇక ఆర్మీలో చెల్లుబాటు

MoU between BRAOU and AOC : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (BRAOU) మరియు ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) సెంటర్, సికింద్రాబాద్ మధ్య సోమవారం అదనపు అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ రెండు సంస్థల మధ్య గతంలో ఉన్న ఒప్పందానికి ప్రస్తుత ఒప్పందం ఆర్మీ  సిబ్బందికి అదనపు అవకాశాలు కల్పించనుంది.

అడ్వాన్స్ డిప్లొమా, మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టడీస్‌లో డిగ్రీ, BA, B.Com, B.Sc వంటి వివిధ ప్రోగ్రామ్‌లను అభ్యసించేలా ఈ  ఒప్పందం (MOU) దోహద పడనుంది.

Nobel Prize : నోబెల్​ పొందిన భారతీయులు.. 2021 నొబెల్​ విజేతలు

Court Writs : ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం

BLISc, MA, M.Com, M.Sc, MLISc, PGDM మరియు MBA కోర్సులను కూడ AOC సెంటర్ లో నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. కె. సీతారామ రావు పేర్కొన్నారు.

వీసీ ప్రొ.కే.సీతారామ రావు సమక్షంలో ఈ ఎంఓయుపై ఇంచార్జ్ రిజిస్ట్రార్ డా.ఎ.వి.ఎన్. రెడ్డి,  ఏఓసీ సికింద్రాబాద్ సెంటర్ కమాండెంట్ బ్రిగేడియర్ అజిత్ అశోక్ దేశ్‌పాండే లు సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా ప్రొ. వైస్-ఛాన్సలర్ ప్రొ.కె.సీతారామరావు మాట్లాడుతూ, AOC సిబ్బంది మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు తమ విశ్వవిద్యాలం అందించే కోర్సులు చదివే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

దేశ రక్షణలో ఉండే ఆర్మీ సిబ్బంది  విద్యార్హతలను మెరుగుపరచడం మరియు అప్‌గ్రేడ్ చేయడం లక్ష్యంగా సేవలు అందిస్తున్నట్లు వివరించారు.

Data Science Training : డాటా సైన్స్‌లో కెరీర్‌ ట్రైనింగ్‌

IISC Online Course : డిజిటల్ హెల్త్​పై ఆరు నెలల ఆన్‌లైన్ కోర్సు..

ఈ కోర్సులు పూర్తి చేయడం ద్వారా పదవీ విరమణ తర్వాత వారి “సెకండ్ కెరీర్”కి ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఏఓసీ సెంటర్ లో లెర్నర్ సపోర్ట్ సెంటర్/యూనివర్శిటీ సెల్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.    

ఈ సమావేశంలో ఏఓసీ సెంటర్ అధికారులు, డిప్యూటీ కమాండెంట్ కల్నల్ ప్రిన్స్ దత్తా, లెఫ్టినెంట్ కల్నల్ విరాజ్ సెమ్వాల్, సుబేదార్ మేజర్ బోర్కర్,

విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇ. సుధా రాణి డైరెక్టర్లు డాక్టర్ బానోత్ లాల్, ప్రో.మధుసూదన్ రెడ్డి,

ప్రొ. షకీలా ఖానం, ప్రొ. పుష్పా చక్రపాణి,  ఇతర డైరెక్టర్లు, డీన్స్, యూనివర్సిటీ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.         

Indian Coast Guard Jobs : ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌      

CISF Jobs : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 

Recent

- Advertisment -spot_img