Vaccine at Home : ఈ నంబర్‌కు కాల్చేస్తే ఇంటికే వచ్చి వ్యాక్సిన్
Vaccine at Home : ‘ఒక్క ఫోన్ కాల్ చేయండి.. మీ ఇంటికి వచ్చి బూస్టర్ డోస్ వేస్తాం’ అని జీహెచ్ఎంసీ ప్రకటించింది.
60 ఏళ్లు దాటిన, అనారోగ్య సమస్యలు (కోమార్బిడిటీస్) ఉన్న వారు జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-2111 1111 కు ఫోన్ చేస్తే ఇళ్ల వద్దకే వచ్చి సిబ్బంది బూస్టర్ డోస్ ఇస్తారని అధికారులు పేర్కొన్నారు.
మూడో దశ కరోనా విజృంభణ నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన, కోమార్బిడిటీస్ ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇస్తోన్న విషయం విదితమే.
ఇప్పటి వరకు బూస్టర్ డోస్ తీసుకోని వారు ఆ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హైల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేస్తే.. మొబైల్ వాహనంలో ఇంటికి వచ్చి వ్యాక్సిన్ ఇస్తారు.
Chicken : చికెన్‌ను స్కిన్‌తో తింటే మంచిదా.. కాదా..
Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు పడకుండా డబ్బు డ్రా చేయడం ఎలా..?