AUSTRALIA: సిబ్బంది కొరత తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా వ్యాపారస్తులకు అక్కడి ప్రభుత్వం ఊరట నిచ్చే నిర్ణయం తీసుకుంది. కోవిడ్ భయంతో దేశ సరిహద్దులను మూసి వేయడం, విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియా విడిచి వెళ్లిపోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. దీనిని సరిదిద్దుకునేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుత సంవత్సరం లో 1,95,000 మందికి వీసా లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో నర్సులు, ఇంజనీర్ల కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీసా లు త్వరిత గతిన ఇవ్వడానికి వచ్చే 9 నెలల్లో 500 మంది సిబ్బంది ని నియమించు కుంటామని ఆస్ట్రేలియా ఇమ్మి గ్రేషన్ మినిస్టర్ అండ్రు గైల్స్ వెల్లడించారు.